Monday 28 December 2020

దశముద్రలు-దశావతారములు- బలరామ, కృష్ణ, కల్కి అవతారములు Dasavataras-Dasamudras-Balarama, Krishna, Kalki avataras

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

గోపాలినీ వేష భృతమ్ భజస్వ

లీలాసఖీం తామ్ భువనేశ్వరస్య

ఇష్టమ్ హృదిస్థమ్ తవహస్తగంస్యాత్

కష్టంచ సంసారభవం న భూయః 

(ఉమాసహస్రము -  25.15)

బీజ ముద్ర (బలరామావతారము)

శివశక్తిసమాశ్లేష స్ఫురద్వవ్యోమాంతరే పునః

ప్రకాశయంతీ విశ్వం సా సూక్ష్మరూప స్థితమ్ సదా ||69||

బీజరూపా మహాముద్రా సర్వసిద్ధిమయే స్థితా

మహాముద్రయనబడు బీజముద్ర ద్వారా సర్వసిద్ధిమయచక్రమునందు ఉత్తేజితమగు శక్తిని ఇప్పుడు తెలుసుకుందాము. సమస్తవిశ్వమునందు సూక్ష్మరూపముగ ప్రకాశించు అవినాభావశివశక్తులను పరమవ్యోమమునందు స్ఫురింపజేయునది, బీజ ముద్ర.

 

ద్వాదశాంతం లలాటోర్ధ్వమ్ కపాలోర్ధ్వావసానకమ్

ద్వయంగుళోర్ధ్వమ్ శిరోదేశమ్ పరంవ్యోమ ప్రకీర్తితమ్||(వరివస్యారహస్యము)

 

విశ్వసృష్టికి బీజమువంటిది, ప్రథమ త్రికోణము/సర్వసిద్ధిచక్రము. లలాటచక్రమునకు పైనున్న పరమవ్యోమ స్థానము సహస్రారచక్రము.

 

అనంతకోటిజన్మానామ్ బీజభూతమ్ సత్ యత్కర్మజాతమ్ పూర్వార్జితమ్ తిష్ఠతి తత్సంచితమ్ జ్ఞేయమ్

 (తత్త్వబోధ 49)         

సంచితకర్మ బ్రహ్మైవాహమితి నిశ్చయాత్మకజ్ఞానేన నశ్యతి (ibid 52)

అనంతకోటి జన్మల కర్మఫలముల బీజరూప సంచితకర్మ, అహమ్ ఏవ బ్రహ్మ యను జ్ఞానముతో నశించుతుంది. 

 

యథైధాంసి సమిద్ధోఽగ్నిః భస్మసాత్కురుతేఽర్జున|
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా||  (భగవద్గీత 4.37)

అర్జునా! ప్రజ్వలించే అగ్ని, కట్టెలను భస్మము చేయువిధముగ, జ్ఞానాగ్ని, సర్వకర్మ(ఫలము)లను భస్మము చేయును.

 

కర్మబీజములు జన్మహేతువులు(సౌన్దర్యలహరి 2,3). సంచితకర్మనుండి పండిన ప్రారబ్ధకర్మవలన ఏర్పడిన త్రిగుణములసంక్షోభము సృష్టికారకము. లయక్రమమునందు మోక్షసాధకులను  నిర్బీజస్థితికి కొనుపోవు ముద్ర.  ఊర్ధ్వదిశగ ప్రయాణించు అగ్నిశిఖవంటి కుండలినీశక్తివలన కర్మబీజములు దహించబడుటద్వారా సాధకులందలి కారణశరీర హేతువైన సంచితకర్మ సమూలముగ నిర్మూలించుటద్వారా జీవులను  ఉద్ధరించునదీ ముద్ర (శివసంహిత 4.35).

 

భూమి అడుగుభాగమునందలి అతిసారవంతమైన మట్టిని నాగలితో పైకి తీసుకురావడముద్వారా సాగు మెరుగుపరచబడును. అదేవిధముగా,  సంచితకర్మనందలి బాగా పక్వమై, అనుభవించుటకు సిద్ధముగనున్న కర్మ, అనగా ప్రారబ్ధకర్మను వెలిదీసి దానికనుగుణముగా తదుపరి జన్మకు క్షేత్రము ఏర్పడుచబడును. ఈ కారణముచే ఈ ముద్ర నాగలిని ఆయుధముగగల్గిన బలరామావతార సంబంధితము.

 

కృష్- నాగలితోదున్నుట; -ప్రోత్సహించునది; దున్నుటకు ప్రోత్సహించునవి నీరుగల్గిన నల్లని మేఘములు. నాగలి-మేఘములవలె,  హలధరుడైన బలరాముడు, నీలమేఘశ్యాముడైన కృష్ణులు.  ఆత్మ/జీవి, కర్మ ఎవ్విధముగా అవినాభావములో అదేవిధముగ త్రికోణ, బిందువులు కూడా అవినాభావములు.   త్రికోణము బలరామావతార సంబంధముగ జూచిన జీవ/ఆత్మ సంకేత బిందువు, శ్రీకృష్ణపరమాత్మ సూచకము.

యోని ముద్ర (కృష్ణావతారము)

సంపూర్ణస్య ప్రకాశస్య లాభభూమిరియం పునః||70||

యోనిముద్రా కలారూపా సర్వానందమయే స్థితా

క్రియాచైతన్యరూపత్వాదేవమ్ చక్రమయమ్ స్థితమ్ ||71||

సర్వానందమయచక్రమునందు సంపూర్ణప్రకాశత్వమును ఉత్తేజింపజేయు ముద్ర,, యోనిముద్ర.  సర్వానందమయ చక్రము/బిందువు స్థానమును ఉత్తేజపరచు ముద్ర.

నారాయణుని దశావతారములందలి సంపూర్ణావతారమైన కృష్ణావతారమునకనుబంధమైనదీ ముద్ర. అష్టప్రకృతి సూచక అష్టభార్యలు, ముఖ్యభార్యలు. పంచజ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మహాభూతములు, మనస్సు యను పదినారు తత్త్వముల అసంఖ్యాక తారతమ్యములు (షోడశసహస్ర) 16వేల భార్యలకు సూచితము. శాస్త్రానుగుణముగా తత్త్వముల సంఖ్య మారునుగాబట్టి, ఆ తత్త్వములసంఖ్యకు తగినట్లు కృష్ణపరమాత్మయొక్క భార్యల సంఖ్యను గణించవలసినది. భార్యయనిన తద్దేవతాశక్తికి సంకేతమని చెప్పుకున్నాము. సకలతత్త్వములతో ఆవిర్భవించిన పరిపూర్ణావతరము కృష్ణావతారము.

 

గోశబ్దమునకు ఇంద్రియమని అర్ధముగలదు. ఏశక్తులద్వారా పరమాత్మ సృష్టిలీలాప్రకాశముజేయుచున్నాడో అవియే గోపులు. ఏ శక్తివశమున సమస్త ఇంద్రియములు సమర్ధవంతములగుచున్నవో అదియే పరమాత్మ, గోపుడు, కృష్ణపరమాత్మ. విశ్వరచన కృష్ణుని లీలావిలాసము. ఆ పరమాత్మునితో ఐక్యమొందుటయే రాసలీల పరమార్ధము.  

 

త్రిఖండ ముద్ర

క్రియాశక్తిస్తు విశ్వస్య మోదనాద్ ద్రావణాత్తథా

ముద్రాఖ్యా సా యదా సంవిదంబికా త్రికలామయీ ||57||

త్రిఖండరూపమాపన్నా సదా సన్నిధికారిణీ

సర్వస్య చక్రరాజస్య వ్యాపికా పరికీర్తితా || 58||

అనంతచైతన్యము (అంబిక) పరిమితత్వమును పొందినప్పుడు,  వామ(ఇచ్ఛా), జ్యేష్ఠ(జ్ఞాన), రౌద్రా(క్రియా)/ వాగ్భవ, కామరాజ, శక్తి కూటములను మూడుకలలతో  కూడిన చక్రరాజముతో సంకేతింపబడుచున్నది. విశ్వమోదన/ద్రావణకారకమైన క్రియాశక్తి, త్రిఖండముద్రగా ప్రకటింపబడినప్పుడు  శ్రీచక్రమంతటావ్యాపించిన శక్తి సన్నిధానమగుచున్నది. జ్ఞాన, జ్ఞాతృ, జ్ఞేయము మొదలగు త్రిపుటిని ఏకముజేయునది. సాధకులందు మనోనియంత్రణ సాధింపజేసి, తద్వారా త్రిపురములందలి శక్తిని ఉత్తేజపరచి మలక్షయమునుగావించునది త్రిఖండముద్ర.  

 

కుండలినీశక్తి ఋజుత్వమును పొందుటద్వారా త్రిపుటీ ఏకత్వమును సాధించు మహాముద్ర త్రిఖండముద్ర (హఠయోగప్రదీపిక 3.10). (మనస్సు) అశ్వమునధిరోహించి సంపూర్ణ(వికల్ప)మలక్షయము గావించిన కల్క్యవతార సూచితమీముద్ర. కల్కియనిన కలుషము. 

 

త్రిపురాశక్తిని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment