Tuesday 8 October 2019

Nobel Prize


శుక్లాంబరరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే||
శ్రీగురుభ్యోనమః

విశ్వసృష్టి సంబంధిత పరిశోధనకు ఇవ్వబడిన 2019వ సంవత్సరము నోబెల్ పురస్కారము గురించి ఒక మాట. బిగ్-బాన్గ్ థియరీ ఆధారిత ఈ పరిశోధనద్వారా పరిశోధకులు, మనము చూచుచున్న సృష్టికారణమైన ప్రథమశక్తిలో 5% మాత్రమేయని తేల్చిచెప్పినట్లు వార్త.

భారతీయ వైదీక వాఙ్మయము, పురాణేతిహాసములందు ఈ విషయము పలుసందర్భములలో మనపూర్వ ఋషులద్వారా చెప్పబడినది. సహస్రనామవివరణయందలి పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా నామ వివరణయందు మనము ఈ విషయమును వీలైనంతవరకు చెప్పుకున్నాము. ఆసక్తిగలవారు మరియొకసారి పరిశీలించగలరు.

శ్రీమాత్రేనమః